Monday, December 23, 2024

గ్రూప్1 పరీక్షకు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న గ్రూప్1 పరీక్ష నిర్వహణపై సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ తహసీల్దార్లు, పరీక్షా కేంద్రాల ఇన్‌ఛార్జులతో వీడియో కాన్ఫరెన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష నిర్వహణకు 22 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వివరాలను వెల్లడించారు. సుజాతనగర్1, కొత్తగూడెం8,లక్ష్మీదేవిపల్లి 4,పాల్వంచ 9 కేంద్రాల్లో 8851 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్షా సమయం ఉదయం 10ః30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని చెప్పారు.

అభ్యర్ధులను ఉదయం 8ః30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, 10ః15 తదుపరి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, టంచన్‌గా 10,15 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసి వేయాలని పేర్కొన్నారు. సమయాన్ని గమనించి పరీక్షా వ్రాసే అభ్యర్ధులు సుదూర ప్రాంతం వాళ్లయినట్లైయితే ఒక రోజు ముందుగానే ఆయా మండలాలకు చేరుకోవాలని చెప్పారు. రాష్ట్ర పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పరీక్ష గ్రూప్‌వన్ అని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్భందీగా నిర్వహించాలని తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పర్యవేక్షణ నివేధిక అందజేయాలని తహసీల్ధార్లను ఆదేశించారు.

విద్యార్ధులను మెటల్ డిటెక్టర్‌తో నిశిత పరీక్ష చేసేందుకు మహిళలకు, పురుషులకు విడివిడిగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్ని పరీక్షా కేంద్రాల్లో సిసి టివిలు ఏర్పాటు చేయాలని ఆదేవించారు. కేంద్రాల్లో సిసి టీవిలు ఏర్పాటు చేసి, దివ్యాంగులకు మొదటి ఫ్లోర్‌లో సీటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్‌టివో వేణు, మిషన్ బగీరథ, ఈఈ తిరుమలేష్, పాల్వంచ మునిసిపల్ కమీషనర్ శ్రీకాంత్, విద్యుత్ శాఖ డిఈ వెంకట రత్నం, సిఐ సర్వయ్య, కలెక్టరేట్ ఏవో గన్యా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News