Monday, December 23, 2024

గ్రూప్ 1 పరీక్షలు పరిశీలించిన డిఎస్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిదిలోని పది పరీక్ష కేంద్రాల్లో 3672 మంది విద్యార్ధులకు గాను 2176 మంది విద్యార్ధులు హాజరై పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా ఈసిఐఎల్ రాధిక కూడలీ వద్ద ఉన్న పరీక్షా కేంద్రాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సేక్షన్ విదించినట్టు తెలిపారు. అలాగే పెద్ద పరీక్ష కేం ద్రాల వద్ద ఎసిపి స్ధాయి అధికారి భద్రతను పర్యవేక్షించారని తెలిపారు. విద్యార్ధులను క్షుణ్నంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రానికి పంపించారు. మహిళా సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టిఎస్‌పిఎస్ అధికారులతో సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసీపీ వెంకట్‌రెడ్డి, సిఐ ప్రవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News