Saturday, December 21, 2024

గ్రూప్ 1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: గ్రూప్ 1 పరీక్షల నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్1 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 11న ఉదయం 10ః30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు గ్రూప్1 పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామని 8654 మంది అభ్యర్థులు పరీక్ష హాజరుకానున్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నియమ నిబంధనలకు లోబడి పరీక్ష కేంద్రాలల పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎలాంటి పొరపాటుకు తావివ్వరాదన్నారు.

కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాట్ల మధ్య పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు లైజెన్ అధికారులను నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు పరీక్ష కేంద్రంలో ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని విషయాలలోను అప్రమత్తంగా ఉండాలని ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అవసరమైన ఆయా ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలని, అభ్యర్థులకు తెలిసేలా పరీక్ష కేంద్రం పేరు, పేపర్ కోడ్ ఏరియా ఆయా పరీక్ష కేంద్రం ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఇన్విజ్‌లేటర్‌లు జాప్యం చేయకుండా కరెక్ట్ టైంకు పేపర్ ఇవ్వాలని టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు.

ఉదయం 8ః30 నుంచి 10ః15 నిమిషాల దాకా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 10ః15 నుంచి పరీక్ష కేంద్రంలోకి ఎవరిని అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలోని అన్ని గదులలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవైనా సిసి కెమెరాలు పనిచేయనట్లయితే ముందుగా తెలియజేయాలని చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. పరీక్ష కేంద్రంల్లో తాగునీరు, విద్యుత్ ఫ్యాన్‌లు తదితర మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు. పరీక్ష సమయంలో నిరంతరాయంగా విద్తు ఉండేలా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను కోరారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు 8ః30 గంటలలోగా చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసి అధికారులకు సూచనలు చేశారు.

చీఫ్ సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్‌లు నో రిలేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ముందు రోజు కూడా ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. 48 మంది అభ్యర్థులు ఉన్న గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్‌లను వేయాలన్నారు. ఆయా అధికారులు సమన్వయంతో పని చేసి గ్రూప్1 పరీక్షలను సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్‌పి సిఇఓ ఎల్లయ్య, డిఐఓ గీవింద్‌రామ్, డిఈఓ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ నగేష్, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డిలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News