Wednesday, December 25, 2024

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్షలు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా జరిగింది. ఆదివారం నాగర్‌కర్నూ ల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులు సమయపాలన పాటిస్తూ ఉదయాన్నే కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

పట్టణంలోని బాలికల పాఠశాల, సాయినగర్ కాలనీలోని బాలుర పాఠశాలతో పాటు మరో కేంద్రం వద్ద అభ్యర్థులు నియమ నిబంధన, సమయపాలన పాటిస్తూ కేంద్రాల వద్ద ఉత్సాహంగా చేరుకున్నారు. కాగా గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాల వద్ద నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో డిఎస్పిలు, సిఐలు అనుదీప్, ఆదిరెడ్డి, ఎస్సైలు గోవర్ధన్, రవిలు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేంద్రాల వద్ద అచ్చంపేట తహసిల్దార్ కృష్ణయ్య సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నియమ నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించారు. అంతకు ముందు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు పట్టణంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించారు. ఈ బందోబస్తు కార్యక్రమంలో డిఎస్పి, సిఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News