Tuesday, December 24, 2024

రేపు గ్రూప్ 1 హాల్‌టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపటి( అక్టోబర్ 14) నుంచి ఆన్ లైన్ లో హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ సహా మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్‌ తప్ప అన్ని పేపర్లను తె లుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో రాయవచ్చు. ఈనెల 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 563 గ్రూప్‌ 1 ఖాళీల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News