ఆఖరి రోజు పరీక్షకు 67.3% హాజరు ఈ నెల 21నుంచి 27వరకు సాగిన
పరీక్షలు రెండు కాలేజీల్లో మాస్ కాపీయింగ్ ఘటనలు, అభ్యర్థులపై చర్యలు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో వారం రోజుల పాటు జరిగిన గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఆదివారం సాయంత్రం 5 గంటలతో పూర్తయ్యాయి. మొత్తం 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 31,383 అభ్యర్థులతో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు స్పోర్ట్ కోటాలో మరో 20మంది అదనంగా మెయిన్స్ ప రీక్షలు రాసేందుకు టిజిపిఎస్‌సి అనుమతి ఇచ్చిం ది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాల ను కేటాయించారు.
అన్ని కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు ప ర్యవేక్షించారు. కాగా, సివిఆర్ కాలేజీ ఘటనలో మాస్ కాపీయింగ్ పాల్పడుతూ ఓ మహిళా అభ్యర్థిని పట్టుపడగా, మరో రోజు నారాయణమ్మ కాలేజీలో ఓ అభ్యర్థినిని అధికారులు పట్టుకున్నారు. మాస్ కాపీయింగ్ పాల్పడిన ఇద్దరి ఆన్సర్ షీట్‌కు అధికారులు స్వాధీనం చేసుకుని వారిని డీబార్ చే శారు. ఈ మేరకు టిజిపిఎస్‌సి మాస్ కాపీయింగ్ కు పాల్పడిన అభ్యర్థిపై చర్యలు చేపట్టింది.
67.3 శాతం హాజరు
గూప్1 మెయిన్స్ పరీక్షలకు చివరి రోజు 67.3 శాతం హాజరు నమోదైంది. ఆదివారం జరిగిన పే పర్4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతవరణ ప రీక్షకు 21,151 మంది అభ్యర్థులు హాజరైనట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 సంవత్సరంలో గ్రూప్ మెయిన్స్ పరీక్షలు జరుగగా, మళ్లీ ఇప్పుడే మెయిన్స్ పరీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను టిజిపిఎస్‌సి విజయవంతంగా నిర్వహించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు కాగా, మూడోసారి విజయవంతంగా పరీక్ష నిర్వహించిన మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, ఈ నెల 21 నుంచి ఆదివారం వరకు విజయవంతంగా టిజిపిఎస్‌సి మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది.