Sunday, December 22, 2024

ప్రారంభం ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

ముగిసిన గ్రూప్-1 మెయిన్స్, తొలిరోజు పరీక్ష.. 72.4% హాజరు
ఆందోళనల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు

మన రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం సోమవారం జరిగిన గ్రూప్1 మెయిన్స్ తొలి పరీక్ష ప్రశాంతంగా ముగిసిం ది. పరీక్షకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యా హ్నం 12.30 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించగా, 1.30 గంటలకు గేట్లు మూసివేశా రు. ఆలస్యంగా వచ్చిన పలువురిని ఎ గ్జామ్ రాసేందుకు అనుమతించలే దు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. సోమవారం నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు జ రుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ విధించారు. 163 సెక్షన్ విధించడంతో పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్‌ఐ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండే లా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎగ్జామ్ రూమ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. పరీక్షలకు సంబంధించిప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను జిపిఎస్ ట్రాకింగ్ అమర్చిన వాహనాల్లో తరలించేలా ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత మార్గాల్లోనే ఆ వాహనాలు ప్రయాణించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News