Friday, December 27, 2024

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి : టిజిపిఎస్సి ని ఆశ్రయించిన అభ్యర్ధులు

- Advertisement -
- Advertisement -

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లలో నిమగ్నమైన నేపధ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ టీజీపీఎస్సీని గ్రూప్స్ అభ్యర్ధులు ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం టీజీపీఎస్సీ అధికారులకు అభ్యర్ధులు లేఖ అందచేశారు. పలు అంశాల మీద అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని కోరారు.

గ్రూప్-1 పిలిమినరీ పరీక్ష కీలో దొర్లిన తప్పులపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారని లేఖలో గుర్తు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఆ కేసులన్నింటినీ మెయిన్స్ పరీక్ష నాటికి పరిష్కరించాలని, లేనిపక్షంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశారు. టీజీపీఎస్సీ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో గ్రూప్-1 అభ్యర్థులు చంద్రమౌళి, వినోద్‌కుమార్, కిరణ్, సంపత్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News