Sunday, January 12, 2025

గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్1 అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిం ది. గూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పిం ది. నోటిఫికేషన్ రద్దు, మె యిన్స్ వాయిదా కోరుతూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌లో 14 తప్పులున్నాయని పిటిషన్‌లో అభ్యర్థులు పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఈ క్రమంలో అభ్యర్థులు హైకోర్టును కోరారు. అభ్యర్థుల వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చే స్తూ సుప్రీంకోర్టుకు అభ్యర్థులు వెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం, పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున వాయిదా అవసరం లేదని సుప్రీంకోర్టు స్ప ష్టం చేసింది.

పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవరసమని సు ప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కోర్టులు జోక్యం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడిం ది. అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా ఒకసారి పేపర్ లీక్ అవడం కారణంగా, మ రొకసారి నిర్వహణ లోపం కారణంగా రద్దు అయ్యాయి. రెండోసారి నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెల్లడించేలా అనుమతివ్వాలని సు ప్రీంకోర్టును గత ప్రభుత్వం కోరింది. అయితే, ప్రస్తుతం వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోగా కోర్టు అనుమతిచ్చింది. దాంతో టిఎస్‌పిఎస్‌సి 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.

వయో పరిమితి పెంపు
గ్రూప్-1 నోటిఫికేషన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ. వరుసగా రెండుసార్లు పరీక్ష రద్దు కావడం, రెండేళ్లు ముగియడంతో వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెం చింది. దీంతో 46 ఏళ్ల వరకు అభ్యర్థులు ఈ గ్రూప్1 పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిచింది. రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేసే క్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 29 పెద్ద వివాదాన్నే రేపింది. ఈ జీవో వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, దీనిని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో 354 పోస్టులు ఎస్‌సి, ఎస్‌టి, బిసి సహా ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు.

ఇవి పోగా మిగిలిన 209 పోస్టులకుగాను 1:50 నిష్పత్తిలో ప్రిలిమినరీ పరీక్షలో టాప్ 10,450 ర్యాంకులు సా ధించిన వారందరినీ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో టాప్ మార్కులు సాధించిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి అభ్యర్థులు కూడా ఉంటా రు. ఇక 354 పోస్టులకు 1:50 నిష్పత్తి చొప్పున 17,700 మంది రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంటుం ది. కానీ జీవో నెంబర్ 29 కింద మొత్తం 563 పోస్టులకూ రిజర్వేషన్ కేటగిరీతో నిమిత్తం లేకుండా 1:50 నిష్పత్తి ప్రకారం మొత్తం టాప్ 28,150 ర్యాంకులు సాధించిన వారందరినీ గుంపగుత్తగా మెయిన్స్‌కు ఎంపిక చేశారని అభ్యర్థులు చెబుతున్నారు.

రిజర్వేషన్ కేటగిరిలో..
అయితే ఈ విధానంలో ఒకవేళ ఏదైనా రిజర్వ్‌డ్ కేటగిరీకి అభ్యర్థులు తక్కువ పడితే 28,150 తర్వాతి వారిని తీసుకుంటున్నారని, ఓపెన్ కేటగిరీ కింద అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులను రిజర్వేషన్ కేటగిరిలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇది రూల్ ఆప్ రిజర్వేషన్‌కు పూర్తి విరుద్ధమని పేర్కొంటున్నారు. అందువల్ల జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో 55కు అనుగుణంగా మొత్తం 563 పోస్టులకు ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కానీ.. జీవో 29వల్ల అదనంగా మరో 3,233 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారని, దీంతో మొత్తం అభ్యర్థులు 31,383 మంది అయ్యారని వివరిస్తున్నారు. జీవో 55 ప్రకారమే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

జీవోలు ఏం చెబుతున్నాయి?
జీవో 29లో రిజర్వేషన్‌ల ప్రకారం కాకుండా నేరుగా మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్పుడు రిజర్వుడు కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, ఆ తర్వాత మెరిట్ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 22, 22ఎ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇందుకోసం జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి జీవో 29ని ప్రభుత్వం జారీ చేసింది. జీవో 55 ప్రకారమైతే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను మల్టీజోన్ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్ తదితర కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తిస్తారు. దీని ప్రకారం గతంలో 503 పోస్టులకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News