హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పరీక్షల కోసం ఆన్‌లైన్ కోచింగ్ కు సంబంధించి ఆగష్టు 5 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని బిసి స్టడీ సర్కిల్‌లో ఈ తరగతులు నిర్వహించనున్నారు. టిఎస్ పిఎస్‌సి గ్రూప్1 ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు 1000 మందిని ఎంపిక చేస్తారు. ఇందుకు గాను డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో, ఎస్‌ఎస్‌సిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుండి బిసి స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానించింది. అధిక విద్యార్హతలకు 10 శాతం వెయిటేజీ మార్కులు, 50 శాతం డిగ్రీ మార్కులకు, 20 శాతం ఇంటర్ మార్కులకు, 20 శాతం ఎస్‌ఎస్‌సి మార్కులకు ఇవ్వబడుతాయని బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ “tsbcstudycircle.cgg.in” ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను 22 జులై నుండి 20 జులై వరకు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 04027077929 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.
ఆగష్టు 5 నుండి గ్రూప్-1 ఆన్‌లైన్ కోచింగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -