Saturday, November 23, 2024

సంగారెడ్డిలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

- Advertisement -
- Advertisement -
  • ఆకస్మికంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్

సంగారెడ్డి: టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆదివారం సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం మొత్తం 27 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10ః30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1గంటలకు ముగిసింది. ప్రతి ఒక అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించాకే పోలీసులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అధికారులు కఠిన నియమ నిబంధనలతో పరీక్షను నిర్వహించారు.జిల్లాలో 8,654 మంది అభ్యర్థులు రాయాల్సి ఉండగా 5,396 మంది విద్యార్థులు గ్రూప్1 పరీక్ష రాశారు.

3258మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. సంగారెడ్డిలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శరత్ సెయింట్ పీటర్స్ హైస్కూల్, రాయల్ కాలేజీ, అక్షయ జూనియర్‌కాలేజ్, సదాశివపేటలోని సెయింట్ మేరీ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. పటాన్‌చెరు మండలంలోని రుద్రారంలోని గీతం కాలేజీ, పటాన్‌చెరులోని శిశువిహార్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ వీరారెడ్డి సందర్శించారు. సంగారెడ్డిలోని 15 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల హాల్‌టికెట్‌లను పరిశీలించాక పోలీసులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష నిర్వహణను సంగారెడ్డి డిఎస్‌పి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపారు. పరీక్ష కేంద్రంలోకి ఫోన్‌లు, ఇయర్ ఫోన్స్, కూలింగ్ గ్లాస్‌లను అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్ సేకరణ ప్రక్రియ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సురేష్ మోహన్, సంగారెడ్డి తహశీల్దార్ విజయ్‌కుమార్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News