Wednesday, December 25, 2024

గ్రూప్-1కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

రేపు ప్రిలిమినరీ పరీక్ష 503 పోస్టుల కోసం 3.80లక్షల మంది పోటీ హాల్ పాటు
గుర్తింపుకార్డు తప్పనిసరి బూట్లు, ఆభరణాలు, చేతిగడియారాలు ధరించరాదు పాదాలకు
మెహందీ అలంకరణలు వద్దు పరీక్షా కేంద్రం గేట్లు 10:15కు మూసివేత రెండు గంటల ముందే
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టుల కోసం ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రిలిమినరీ పరీ క్ష ఆబ్జెక్టివ్ టైప్ ఒఎమ్‌ఆర్ బేస్డ్ ఉంటుందని తె లిపారు. టిఎస్‌పిఎస్‌సి 503 పోస్టుల కోసం గత ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసిన విష యం తెలిసిందే. గ్రూప్ 1 పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం జరిగే ప్రిలిమినరి పరీక్ష ఉదయం 10.30 గం.టల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహిస్తారు. ఇప్పటికి 3,20,327 మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగి ఐడి, డ్రైవింగ్ లైసెన్స్‌ల లో ఏదైనా ఒక ఐడి తీసుకుని రావాలన్నారు. హా ల్‌టికెట్‌పై స్పష్టమైన ఫొటోగ్రాఫ్, సంతకం లేని అభ్యర్థులు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మూడు పాస్‌పోర్ట్ సైజ్ పొటోగ్రాఫ్‌లతో పాటు అండర్‌టేకింగ్ ఇన్విజిలేటర్‌కు అప్పగించాలన్నారు. మొబైల్ ఫో న్లు, టాబ్లెట్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూ టూత్ పరికరాలు, వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టే బుల్, వాలెట్‌తో సహా ఎలక్ట్రానిక్, ఏదైనా ఇతర గాడ్జెట్‌లను తీసుకెళ్లరాదు, పర్స్, నోట్స్, చార్జర్ లు, లూజ్ షీట్‌లు లేదా రికార్డింగ్ సాధనాలు, ఉండరాదు. బూట్లు, ఆభరణాలు, చే తి గడియారం ధరించరాదని చేతికి,.

పాదాలకు ఎటువంటి మెహిందీ, ఇంక్ పూయవద్దని సూచించారు. ఒఎంఆర్ జవాబు పత్రంలో 10 అంకెల హాల్‌టికెట్ నెంబర్, ఆరు అంకెల టెస్ట్ బుక్‌లెట్ నెంబర్ ఉంటాయని ఒఎంఆర్ షీట్ నమూనా డిజిటల్ కాపి టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. సమాధానాలు బబ్లింగ్ చేయడంతో సహా ఒఎంఆర్ షీట్‌లోని సంబంధిత బ్లాక్‌లను పూరించడానికి అభ్యర్థి బాల్‌పాయింట్ పెన్ (నీలం లేదా నలుపు) ఉపయోగించాలన్నా రు. అభ్యర్థి తప్పనిసరిగా ఒఎంఆర్ షీట్‌లోని హాల్‌టికెట్ నెంబర్, టెస్ట్ బుక్‌లెట్ నెంబర్ వెన్యూకోడ్‌సరిగ్గా ఎన్‌కోడ్ చేయాలి, లేని పక్షంలో సమాధా న పత్రం చెల్లదని సూచించారు. పరీక్షా కేంద్రాల గేట్లను ఉదయం 8.30 గంటలకు తెరిచి ఉద యం 10.15 గంటలకు మూసివేస్తారు. అభ్యర్థులు ఎనిమిదిన్నర గంటలకు ముందే రిపోర్ట్ చేయాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News