Wednesday, January 22, 2025

గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభం… పలు చోట్ల అభ్యర్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది.  సరిగ్గా పది గంటలకే సెంటర్ల మెయిన్ గేట్స్ మూసివేశారు. 10.30 తరువాత వచ్చిన వారిని గ్రూపు-1 పరీక్షకు అనుమతించక పోవడంతో నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ వద్ద గ్రూప్1 అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. ఎంత బ్రతిమిలాడిన అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అబిడ్స్ స్టాన్లీ కాలేజ్ వద్ద గ్రూప్1 అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. ఫోన్లు, బ్యాగ్ లు పెట్టేందుకు లాకర్ల సదుపాయం లేక పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అసలే పరీక్ష సమయం కావడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి, కాలేజీ యజమాన్యానికి సర్ది చెప్పి అభ్యర్థులను లోపలికి పంపించారు.  గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి అభ్యర్థికి యూనిక్ ఓఎంఆర్ షీట్‌ను ఇవ్వనున్నట్లు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 897 ఎగ్జామ్ సెంటర్లను కమిషన్ ఏర్పాటు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News