Tuesday, December 24, 2024

నేడు గ్రూప్-1 ప్రిలిమినరీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్షా కేంద్రాల ఏర్పాటు హాజరు
3.80లక్షల మంది అభ్యర్థులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసెస్ పోస్టుల భర్తీ కోసం ఆదివా రం జరుగనున్న ప్రిలిమినరీ పరీక్షకు టిఎస్‌పిఎస్‌సి పకడ్బందీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాల్లో కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. 3 లక్షల 80వేల 81 మంది అ భ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కానున్నా రు. పరీక్ష ప్రశాంతంగా జరుగడానికి అన్ని రకా ల చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లో 115 పరీక్షా కేంద్రాల్లో 51,931 మంది అ భ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా హైదరాబాద్ జిల్లాలో 106 పరీక్షా కేంద్రాల్లో 51,851 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో128 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ఇక్కడ 51,718 మంది పరీక్షకు హాజరు కా నున్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 7 పరీ క్షా కేంద్రాల్లో 1,933 మంది పరీక్షకు హాజరు కా నున్నారు. ఆబ్జెక్టివ్ టైప్ -ఒఎమ్‌ఆర్ బేస్డ్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని టిఎస్‌పిఎస్‌సి అధికారులు తెలిపారు. పోస్టుల కోసం గత ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

పరీక్ష ఉదయం 10.30 గం.టల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహిస్తారు. అ భ్యర్థులు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 10.15 గంటలకు గేట్లు మూసివేస్తారు. పరీక్ష ఏర్పాట్ల, నిర్వహణకు సంబంధించి టిఎస్‌పిఎస్‌సి అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఇప్పటికే పలు సూచనలు చేసింది. అభ్యర్థులు హాల్‌టికెట్లపై ముద్రించిన సూచనలను జాగ్రత్తగా పరిశీలించి వాటిని పాటించాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగి ఐడి, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదైనా ఒక ఐడి తీసుకుని రావాలన్నారు. హాల్‌టికెట్‌పై స్పష్టమైన ఫోటోగ్రాఫ్, సంతకం లేని అభ్యర్థులు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మూడు పాస్‌పోర్ట్ సైజ్ పొటోగ్రాఫ్‌లతో పాటు అండర్‌టేకింగ్ ఇన్విజిలేటర్‌కు అప్పగించాలన్నారు. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, కాలిక్యులేటర్, లాగ్ గ్, వాలెట్‌తో సహా ఎలక్ట్రానిక్, ఏదైనా ఇతర గాడ్జెట్‌లను తీసుకెళ్లరాదు, పర్స్, నోట్స్, చార్జర్‌లు, లూజ్ షీట్‌లు లేదా రికార్డింగ్ సాధనాలు, ఉండరాదు.

అభ్యర్థులు బూట్లు, ఆభరణాలు, చేతి గడియారం ధరించరాదని చేతికి,. పాదాలకు ఎటువంటి మెహిందీ, ఇంక్ పూయవద్దని సూచించారు. ఒఎంఆర్ జవాబు పత్రంలో 10 అంకెల హాల్‌టికెట్ నెంబర్, ఆరు అంకెల టెస్ట్ బుక్‌లెట్ నెంబర్ ఉంటాయని ఒఎంఆర్ షీట్ నమూనా డిజిటల్ కాపి టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. సమాధానాలు బబ్లింగ్ చేయడంతో సహా ఒఎంఆర్ షీట్‌లోని సంబంధిత బ్లాక్‌లను పూరించడానికి అభ్యర్థి బాల్‌పాయింట్ పెన్ ( నీలం లేదా నలుపు) ఉపయోగించాలన్నారు. అభ్యర్థి తప్పనిసరిగా ఒఎంఆర్ షీట్‌లోని హాల్‌టికెట్ నెంబర్, టెస్ట్ బుక్‌లెట్ నెంబర్ వెన్యూకోడ్‌సరిగ్గా ఎన్‌కోడ్ చేయాలి, లేని పక్షంలో సమాధాన పత్రం చెల్లదని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News