Tuesday, November 5, 2024

టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేయాలి: బల్మూరి వెంకట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరి వెంకట్ తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరి వెంకట్ స్పందించారు. ఇప్పటికైనా టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన జరగాలని, ప్రక్షాళన చేయకపోతే మంత్రులు, అధికారులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండోసారి పరీక్ష వేళ బయోమెట్రిక్ తీసుకోకుండా ఎందుకు నిర్లక్షం వహించారని ప్రశ్నించారు. యువత జీవితాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రూప్-1 రెండోసారి నిర్వహించినా కనీస జాగ్రత్తలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో టిఎస్‌పిఎస్‌సి నిర్లక్షం బయటపడిందని, టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన చేయకుండా కొనసాగించినందుకే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. శనివారం గ్రూప్-వ ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష టిఎస్‌పిఎస్‌సి నిర్వహించింది.

Also Read: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు లేవు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News