Tuesday, January 14, 2025

ప్రశాంతంగా గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రూ ప్1 ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిం ది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 897 పరీక్షా కేం ద్రా ల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మ ధ్యాహ్నం 1గంటల దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమి షం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయా రు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆ లస్యంగా వచ్చినా అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది ని రాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్1 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగ తి తెలిసిందే. గతంలో రెండు సార్లు రద్దైన ప్రిలిమినరీ రాత పరీక్షను ఎట్టకేలకు ఆదివారం నిర్వహించారు. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గ్రూ ప్1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది.

అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్ష ను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూ న్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొంద రు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజా గా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్ ను ప్రక్షాళన చేపట్టి కొత్తగా 60 గ్రూప్1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏ డాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళన
గ్రూప్1 పరీక్ష సందర్భంగా జగిత్యాల పట్టణంలో పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు ది గారు. అరగంట సమయం ఉన్నా 5 నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పారని, టైం అ యిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అ దుపులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో..
గ్రూప్1 పరీక్షకు అనుమతించకపోవడంతో నాం పల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ వద్ద గ్రూప్1 అభ్యర్థుల ఆందోళన చేశారు. ఎంత బ్రతిమిలాడి న అనుమతించడం లేదని వ్యక్తం చేయడం కనిపించింది. అబిడ్స్ స్టాన్లీ కాలేజ్ వద్ద గ్రూప్1 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. ఫోన్‌లు, బ్యాగ్ లు పెట్టేందుకు లాకర్ల సదుపాయం లేక పోవడంతో అ భ్యర్థులు ఆందోళనకు దిగారు. అసలే పరీక్ష సమ యం కావడంతో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి, కాలేజీ యజమాన్యానికి సర్ది చెప్పి అభ్యర్థులను లోపలికి పంపించారు.

నిమిషం నిబంధనతో నో ఎంట్రీ
గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా పరీక్ష కేం ద్రాల్లో ఉదయం 10గం.ల వరకే అనుమతిస్తామని టిజిపిఎస్‌సి చెప్పడంతో అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సెంటర్ల వద్ద భా రీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరిని చెక్ చే సిన తర్వాతే లోనికి అనుమతించాఉ. రాష్ట్ర వ్యాప్తం గా కొన్ని సెంటర్ల వద్ద కొంత మంది అభ్యర్థులు ఆ లస్యంగా రావడంతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో వెనుతిరిగారు. సిద్దిపేట డిగ్రీ కాలేజీ సెంటర్ వద్ద నిర్ణీత సమయానికి నిముషం ఆలస్యంగా వచ్చిన పది మంది అభ్యర్థుల ను అధికారులు అనుమతించలేదు. కరీంనగర్ జి ల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల సెంటర్‌కి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని అధికారులు లోపలికి అనుమతించలేదు. గోదావరిఖనిలో బాలికల జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో తీగల కావేరీ అనే యువతి 8 నిముషాలు ఆలస్యంగా రావడంతో సిబ్బంది వెనక్కు పంపించారు.

ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు
గ్రూప్1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్‌టిసి ఆదివారం ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాలని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయం త్రం నుంచే ఎంజిబిఎస్, జెబిఎస్, ఉప్పల్, ఎల్‌బి న గర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి ఆర్‌టిసి బస్సు సర్వీసులు నడిపింది.
మద్యం తాగి డ్యూటీకి..
గ్రూప్1 పరీక్ష డ్యూటీకి మద్యం తాగి వచ్చిన అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జరుగుతున్న గ్రూప్1 పరీక్షకు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ గా విధు లు నిర్వహిస్తున్నాడు పర్వేజ్. అయితే పర్వేజ్ మ ద్యం తాగినట్లుగా గుర్తించిన పోలీసులు పోలీస్ స్టే షన్‌కు తరలించి విచారిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా అతనికి అందులో 170 శాతం రీడిం గ్ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News