Monday, January 20, 2025

గ్రూప్-1 ప్రిలిమ్స్ అక్టోబర్ 16న

- Advertisement -
- Advertisement -

జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ : టిఎస్‌పిఎస్‌సి
503 పోస్టులకుగాను 3,80,202 దరఖాస్తులు

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేది ఖరారయ్యింది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. తెలంగాణ తొలి గ్రూప్ 1 ప్రకటన కు భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. గ డువు ముగిసే నాటికి (జూన్ 4) మొత్తం 503 పో స్టులకు గాను 3,80,202 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 756 మం ది చొప్పున పోటీ పడుతున్నారు. డిప్యూటీ కలెక్టర్, డిఎస్‌పి పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఎఎస్, ఐపిఎస్ అయ్యే అవకాశం ఉండటంతో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశముందని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. మొత్తం 503 పోస్టుల కు గాను మహిళలకు 225 పోస్టులు రిజర్వు అయ్యాయి.

వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీ పడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందే అవకాశం ఉంది. దివ్వాంగుల కేటగిరిలో 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 254 మంది పోటీలో ఉన్నారు. కాగా దరఖాస్తు దారుల్లో 51,553 మంది అంటే 15.33 శాతం మంది ప్రభుత్వోద్యోగులు ఉండడం విశేషం. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను జులై / ఆగష్టు నెలలో నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే పరీక్షలకు సన్నధ్ధం కావడానికి సమయం కావాలని అభ్యర్థుల నుండి అందిన అనేక విజ్ఞప్తులు, ఆగష్టు, సెప్టెంబర్ అక్టోబర్‌లలో జరుగునున్న ఇతర పోటీ పరీక్షలు, పండుగలు, విద్యార్థుల రెగ్యులర్ చదువులు అన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రిలిమినరీ పరక్షను అక్టోర్ 16న జరుపాలని నిర్ణయం తీసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News