Thursday, January 23, 2025

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం నాడు రాత్రి వెల్లడించింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి జాబితాను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 25,050మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 503 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎం పిక చేశారు. మెయిన్స్ పరీక్షను జూన్ మాసంలో నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 18న మెయిన్ పరీక్ష విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్టు తెలిపింది. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే 040-22445566, 04023542185 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News