Thursday, January 23, 2025

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

వెబ్‌సైట్‌లో అందుబాటులో
తుది కీ 1:50 నిష్పత్తిలో
31,382 మంది మెయిన్స్‌కు
ఎంపిక అక్టోబర్ 21
నుంచి 27 వరకు మెయిన్స్
పరీక్షలు పరీక్షకు వారం
ముందు అందుబాటులో
హాల్ టికెట్లు

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రూప్ -1 ప్రిలిమ్స్ తుది కీతో పాటు ఫ లితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత కమిషన్ ఆదివారం తుది కీ విడుదల చేసింది. అనంతరం ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. తుది కీ ని అభ్యర్థులు తమ లాగిన్‌తో చూసుకోవచ్చని పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు వెల్లడించింది. 563 గ్రూప్ 1 పోస్టులకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా కమిషన్ మె యిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిజిపిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,03,645 హాల్ టికెట్లను టిజిపిఎస్ సి జారీ చేసింది. అందులో 3,02,172 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 13న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల చేయ గా, దానిపై అభ్యంతరాలు తెలియజేందుకు జూన్ 17 గడువు ఇచ్చింది. అనంతరం జైన్ 24న అభ్యర్థుల ఒఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన త ర్వాత నిపుణుల కమిటీ అభ్యంతరాలను పరిశీలించింది. నిపుణుల క మిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది కీ ఖరారు చేయగా, తాజాగా తుది కీ తో పాటు మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిజిపిఎస్‌సి విడుదల చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే అభ్యర్థులు హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రిలిమ్స్ కటాఫ్‌ను ప్రకటించనున్నట్లు, స్పోర్ట్ కోటా అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ వెల్లడించింది.
నిష్పత్తిని తగ్గించాలని నిరసనలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో చేయాలని రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, కొందరు అభ్యర్థులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే టిజిపిఎస్‌సి మాత్రం గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపింది.
మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
F అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)
F అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
F అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
F అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)
F అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్)
F అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)
F అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News