Wednesday, January 22, 2025

ప్రవళికది ఆత్మహత్య కాదు హత్యే: రాహుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. విద్యార్థి ప్రవళికదు ఆత్మహత్య కాదని, మూమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపణలు చేశారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి యువత కళలు, వారి ఆశయాలను బిజెపి, బిఆర్ఎస్ ఆగం చేశామని మండిపడ్డారు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు లేక తెలంగాణ యువత విలవిలలాడుతోందని బాధను వ్యక్తం చేశారు. యుపిఎసి తరహాలలో టిఎస్ పిఎస్ సిని పునర్ వ్యవస్తీకరించి సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రవళిక అనే విద్యార్థిని గ్రూప్2 కోచింగ్ తీసుకుంటుంది. ఆమె తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడంతో గ్రూప్-2 అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షలు రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పరీక్షలు రెండు సార్లు రాసిన తరువాత రద్దు చేయడంతో  తెలంగాణలో నిరుద్యోగులు టిఎస్ పిఎస్ సిపై ఆగ్రహంగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News