Monday, January 20, 2025

TSPSC వద్ద గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: TSPSC వద్ద గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనకు చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ టిఎస్పిఎస్సి ముట్టడికి అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో నాంపల్లిలోని టిఎస్పిఎస్సి ఆఫీస్ వద్దకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. దీంతో టిఎస్పిఎస్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. టిఎస్పిఎస్ ముట్టడించేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. గ్రూప్-2 అభ్యర్థులకు కోదండరామ్, యూత్ కాంగ్రెస్ లీడర్ బల్మూరి వెంకట్ మద్దతు తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News