Monday, December 23, 2024

గ్రూప్-2 పరీక్ష నవంబర్ కు వాయిదా

- Advertisement -
- Advertisement -

సిఎం ఆదేశాలతో నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-2 పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిం ది. అభ్యర్థుల కోరిక మేరకు పరీక్ష నవంబర్ నెలకు వాయిదా వే సింది. అయితే ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారనే విషయంపై స్పష్ట త రావాల్సి ఉన్నది. తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఎగ్జామ్ రీషెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని టిఎస్‌పిఎస్‌సితో సంప్రదించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో కమిషన్ విడుదల చేసే రిక్రూట్‌మెంట్ నోటిఫి కేషన్‌లు ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించేలా కాకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా ప్లాన్ చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. అలా ప్లాన్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హులైన అందరు అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందని కెసిఆర్ సూచించారు. సి ఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా శనివారం సిఎస్, టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సెక్రటరీ లతో సమీక్షించి గ్రూప్-2 పరీక్షల విషయ మై అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించి, గ్రూప్-2 పరీక్షలను సిఎం కెసిఆర్ ఆదేశానుసారం నవంబర్‌కి వాయిదా వేయాలని నిర్ణయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News