Monday, December 23, 2024

తెలంగాణా గ్రూప్-2 పరీక్షల వాయిదా తప్పదా?

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు జనవరి 6,7 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ పది రోజులే సమయం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణపై పెదవి విప్పడం లేదు.

గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 2,3 తేదీల్లో జరగాలి. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కమిషన్ చైర్మన్ సహా ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించవలసి ఉంది.

వివిధ శాఖల్లో ఉన్న 783 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదున్నర లక్షలమంది నిరుద్యోగులు దరఖాస్తులు పంపారు. మొదట్లో ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీలకు వాయిదా వేసింది. ఎన్నికల కారణంగా పరీక్షలు జనవరి 6,7 తేదీలకు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈసారి కూడా పరీక్షలు జరిగే అవకాశం లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News