Monday, November 25, 2024

నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2

- Advertisement -
- Advertisement -

పరీక్షలను రీషెడ్యూల్ చేసిన టిఎస్‌పిఎస్సీ
నిరుద్యోగుల హర్షాతిరేకం

హైదరాబాద్ : తెలంగాణ గ్రూపు-2 పరీక్షలను టిఎస్‌పిఎస్సీ రీ షెడ్యూల్ చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పరీక్షలకు వారంరోజుల ముందు ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కాగా, ఈనెల 29, 30వ తేదీల్లో జరుగాల్సిన గ్రూపు-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరీక్షలను నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించి ఆదివారం -పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో గ్రూప్-2 కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెలలో గురుకుల టీచర్ పరీక్షలు, స్టాప్‌నర్సు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆ ఫీసర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, ఎస్‌ఎస్‌పి, ఐబిపిఎస్ వంటి పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టారు. దీంతో అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు సిఎం కెసిఆర్ ఆదేశాలతో సిఎస్ శాంతికుమారి టిఎస్‌పిఎస్సీ చైర్మ న్, కార్యదర్శితో సమావేశమై అన్ని అంశాలను చర్చించి, పరిస్ధితులను సిఎంకు నివేదించారు. ఆయన ఆదేశాలతో పరీక్షలు నవంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు టిఎస్‌పిఎస్సీ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తేదీల మార్పుపై నిరుద్యోగులు హర్షం :  ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసిన నవంబర్ 2,3 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటన చేయడం పట్ల నిరుద్యోగ అభ్యర్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే నెలల్లో ఆరు రకాల పరీక్షలు ఉండటంతో అన్నింటికి ప్రిపేర్ కావడం సాధ్యంకాదని, గ్రూపు-2ను కొత్తగా ఖరారు చేసిన తేదీలతో తాము అనుకున్న విధంగా రాస్తామని పేర్కొంటున్నారు. సిఎంకెసిఆర్, సిఎస్ శాంతికుమారికి కృతజ్ఙతలు తెలిపారు. ఓయూలో బిఆర్‌ఎస్వీ, బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ విద్యార్ధిసంఘాల నాయకులు బాణాసంచాలు పేల్చి నిరుద్యోగులకు అండగా నిలిచే బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News