Thursday, January 23, 2025

గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలి: ఎన్‌ఎస్‌యుఐ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ఎన్‌ఎస్‌యుఐ నాయకులు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఒకేరోజు మూడు పరీక్షలు ఉండటంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెబుతూ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. గ్రూప్-2 పరీక్ష రోజు పిజిటి, టిజిటి, జెఎల్, డీఎల్ పరీక్షలు ఉన్నాయన్నారు. ఇప్పటికే గురుకుల నోటిఫికేషన్ కు 2 లక్షల 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. దీంతో గ్రూప్-2 షెడ్యూల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పైగా ఈ మూడు పరీక్షలు వేర్వేరు సెంటర్లు ఉంటాయని గుర్తుచేశారు. ఇప్పటికే గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News