Wednesday, January 22, 2025

ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

Group- 2,3,4 Apply for free training

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రూప్ 2,3,4, డిఎస్‌సి, గురుకులాల ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని బిసి స్టడీ సర్కిళ్లలో ఈ ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. గ్రూప్- 2,3,4 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించాలని, డిఎస్సీ, గురుకులాలకు దరఖాస్తు చేసుకునేందుకు 60 శాతం మార్కులతో బిఎడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని సూచించారు. దరఖాస్తులను ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలోని టిఎస్ బిసి స్టడీ సర్కిల్‌లో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు 040- 24071178, -27077929లో సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News