- Advertisement -
నేటితో తెలంగాణలోని గ్రూప్-4 దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. మొత్తం 8,180 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, నిన్న ఒక్కరోజే దాదాపు 59 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సర్వర్ పై తీవ్ర ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.కాగా, ఏప్రిల్/ మే నెలలో గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండనున్నట్లు ప్రకటించారు. TSPSC నుండి అతి పెద్ద నోటిఫికేషన్ ఇదేనని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -