Wednesday, January 22, 2025

గ్రూప్ 4 పరీక్ష సజావుగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జూలై 1న జిల్లాలో టీఎస్‌పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 4 పరీక్ష సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏ ర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలువురు అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆమె మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాల్లో 17,927 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమకూర్చాలని తెలిపారు. అలాగే అభ్యర్థులు పరీక్షకు 15 నిముషాల ముందు రావాలని, ఉదయం 9.45, మధ్యాహ్నం 2.15 గంటల లోగా పరీక్ష కేంద్రంలో ఉండాలని సూచించారు.

జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలను పోలీసు ల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం నుండి నిబంధనలు పాటిస్తూ తరలించాలన్నారు. ముందుగా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, చీఫ్ సూపరింటెండెంట్, లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులు పరీక్ష రోజు చేయాల్సి న విధి, విధానాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, చీఫ్ సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News