- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట: గ్రూప్ 4 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవా రం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రూప్ 4 పరీక్ష నిర్వహ ణ గూర్తి పరీక్ష సెంటర్ల లైజర్ ఆఫీసర్స్, రూట్ ఆ ఫీసర్స్, ప్లైయింగ్ స్వాడ్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేప ర్1. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు పేపర్ 2 నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు జిల్లాలో 80 సెంటర్లలో 25980 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నార ని తెలిపారు. టిఎస్పిఎస్సి బోర్డు వెలువరించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కటి చదువుతూ అధికారులకు వివరించారు.
ప్రతి అధికారి పరీక్ష నిర్వహణ రోజు ముందురోజు ఏం చేయాలి ఎలా ని ర్వహించాలి. అనేక విషయాల గూర్చి దిశా నిర్ధేశం చేశారు. గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి రెండు పేపర్ వారిగా ఉదయం, మద్యాహ్నం అవకతవకలు జరగకుండా వేరే వేరే కలర్లలో టిఎస్పి ఎస్సి పేపర్ డిజైన్ చేసిందన్నారు. పరీక్ష సెంటర్‌లో ప్రతి గదిని చెక్ చేసి గదులలో బల్లలు, లైట్లు, ఫ్యాన్లు అన్ని ఉండేలా చూడాలన్నారు. అభ్యర్థుల సిట్టింగ్ ఆరెంజ్ మెంట్ జాగ్రత్తగా చేయాలన్నారు. సిసి కెమెరాలు సెంటర్ మొత్తం లేదా కనీసం చీప్ సూపరింటెండెంట్ రూంలో అయిన తప్పని సరి గా ఉండాలన్నారు. సెంటర్లలో ఏ ఒక్క సిబ్బంది దగ్గర మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గడియారంకు సంబంధించిన ఏవి ఉండకుండా చూసుకోవాలన్నారు.
అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి బ యట చెక్ చేసి, బయోమెట్రిక్ అయిన తర్వాతనే లోనికి పంపాలన్నారు. ఉదయం 9.45కి గేట్ మూసివేయాలన్నారు. ప్లైయింగ్ స్వాడ్ అధికారి వచ్చిన చెక్ చేసి మొబైల్ ఫోన్ తీసుకొని లోపలికి పంపాలి. వికలాంగుల కోసం స్ర్కైబ్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఒక రోజు ముందే అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. చీఫ్ సూపరిండెంట్‌లతే పూర్తి బాధ్యత ఎలాంటి పోరపాట్లు జరగకుండా పకడ్బందీగా పరీక్షను నిర్వహించాలని అధికారులను అదేశించారు. నేడు సరిపడనన్ని వాహనాలు అందుబాటులో ఉండాలని జిల్లా రవా ణా శాఖ అధికారికి తెలిపారు. సమస్యాత్మక సెం టర్‌ల్లో పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు పోన్ ద్వారా తెలిపారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళిక వారు జారీ చేసిన హండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సిద్దిపేట జిల్లా 2021-22 బుక్‌ను అందరూ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. డిఆర్‌ఓ లక్ష్మి కిరణ్, జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్, కలెక్టరేట్ ఎఓ అబ్ధుల్ రహమాన్‌లు పాల్గొన్నారు.