Saturday, January 4, 2025

గ్రూప్ 4 పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 4 పరీక్షను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జూలై 1న నిర్వహించే గ్రూప్ 4 పోటీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని అలాగే జూలై 1న జరగనున్న గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. లైజన్ అధికారులు, చీప్ సూపరింటెండెం ట్‌లు పరీక్ష కేంద్రాలను పరిశీలించి, సీటింగ్, లైటింగ్, మంచినీటి సౌకర్యం, సిసి కెమెరాలు, మరుగుదొడ్లు తదితర వసతి సౌకర్యాలను పరిశీలిం చాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో వివిధ రూట్లలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.

టిఎస్‌పిఎస్‌సి గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరూ చదివి నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 73 కేంద్రాల్లో 21,937 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఆశాలు, ఎఎన్‌ఎంలతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను అందు బాటులో ఉంచాలన్నారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అలాగే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు రవాణాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని రూట్లలో పరీక్ష సమయానికి ముందే బస్సులను నడిపించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుధ్ద పనులు చేపట్టాలని, అందుకు మున్సిపల్ పంచాయతీ సిబ్బందిని సిద్దంగా ఉంచాలన్నారు. మహిళా అభ్యర్థులను మహిళా పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే లా కావాల్సిన సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.

పరీక్ష రోజున ఉదయం 7.30 గంటలకే లైజన్ అధికారులు, చీప్ సూపరింటెం డెంట్‌లు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి నిషిత పరిశీలన చేసి పంపించాలని ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఖరీదైన వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడ ంతో పాటు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

అభ్యర్థులు ఆభరణాలు ధరించి పరీక్ష కేంద్రాలకు వెళ్లడం కుదరదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, కోరుట్ల ఆర్‌డిఓ వినోద్‌కుమార్, జగిత్యాల, మెట్‌పల్లి డిఎస్‌పిలు ప్రకాష్, రవీందర్‌రెడ్డి, విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, ఫ్లైయింగ్ స్వాడ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News