Monday, December 23, 2024

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 పరీక్షలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, తిమ్మాజిపేట, బిజినేపల్లి, బల్మూర్, పెద్దకొత్తపల్లి, వెల్దండ మండలాల కేంద్రాల్లోని 50 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 85 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉదయం 10 గ ంటల నుంచి 12.30 వరకు జరిగిన పేపర్ 1 పరీక్షకు 16 వేల 632 మంది అభ్యర్థులకు గాను 14 వేల 126 మంది హాజరు కాగా 2 వేల 506 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్ 2 గ్రూప్ 4 పరీక్షకు 16 వేల 632 మంది అభ్యర్థుల కు గాను 14 వేల 94 మంది హాజరు కాగా 2 వేల 539 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి నేరుగా ప్రత్యక్షంగా ఈ పరీక్షలను వెబ్ కాస్టిం గ్ ద్వారా పర్యవేక్షించి, జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.

అభ్యర్థుల హాజరు-, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలిం చి అధికారులను అడిగి వివరాలలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం నుంచి ప్రశ్నా పత్రాలను 14 రూట్ల ద్వారా 50 పరీక్ష కేంద్రాలకు పటిష్ట భద్రత మధ్య తరలించే ప్రక్రియను పర్యవేక్షించారు. బిసి వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి ప్లయింగ్ స్వాడ్‌గా జిల్లా కేం ద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. నాగర్‌కర్నూల్ ఆర్డిఓ నాగలక్ష్మి,ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అ ధికారి రాజశేఖర్ రావు, కలెక్టరేట్, రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు కర్ణాకర్, నీరజ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News