Friday, November 15, 2024

జూలై 1న గ్రూప్ 4 పరీక్షలు

- Advertisement -
- Advertisement -
  • జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు
  • అదనపు కలెక్టర్ వీరారెడ్డి

సంగారెడ్డి: గ్రూప్ 4 పరీక్షలు జూలై 1న నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ 4 పరీక్షలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జూలై 1న నిర్వహించే గ్రూప్ 4 పరీక్షకు జిల్లాలో టిఎస్‌పిఎస్‌సి నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. 1వ తేదీన పేపర్ 1పరీక్ష ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై 12:30 గంటల వరకు ఉంటుందన్నారు. పేపర్2 మధ్యాహ్నం 2ః30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 101పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. టిఎస్‌పిఎస్‌సి గైడ్‌లైన్స్‌ను ప్రతిఒక్కరూ చదివి నిబంధనలు పాటించాలని, లైనింగ్ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్‌లు పరీక్ష కేంద్రాలను సందర్శించి తాగునీరు, విద్యుత్ సౌకర్యం, సిసి కెమెరాలు, మౌలిక వసతులను చూడాలన్నారు.

పరీక్ష రోజు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని ఆదేశించారు. 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని, సెల్‌ఫోన్‌లు, రైటింగ్ ప్యాడ్స్ అనుమతించరన్నారు. జిల్లాలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పావుగంట ముందే పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రతి 24మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించినట్లు చెప్పారు. ఇన్విజిలేటర్‌లను లాటరీ ద్వారా అలాట్ చేయాలని, ఇన్విజిలేటర్‌ల నుంచి నో రిలేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లో సీటింగ్ ఏర్పాటు చేయాలని, నామినల్ రోల్స్‌లో ఎక్కడైన ప్రింటింగ్ రాకపోతే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. రేపు ఇన్విజిలేటర్‌లకు 30న ఖచ్చితంగా శిక్షణ ఇవ్వాలన్నారు. పరీక్ష కేంద్రాలకు పోలీసుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూం నుంచి నిబంధనలను పాటిస్తూ ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నగేష్, డిప్యూటి డిఇఓ విజయ, వివిధ శాఖల అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News