Sunday, December 29, 2024

గ్రూప్-4 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : గ్రూప్-IV పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. నేడు నిర్వహించే గ్రూప్-IV పరీక్షల ఏర్పాట్లపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రేపు జూలై 1న జరగనున్న గ్రూప్-IV పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో ఇబ్బందులు లేకుoడా చూడాలని, ఏ ర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు సిబ్బందిని సమన్వ య పరుచుకొని సకాలంలో సిబ్బంది హజరయ్యేలా ఆదేశించాలని సూచించారు.

చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాల రికార్డి ంగు ఉండాలని, పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అ మలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించా రు. పరీక్షా కేంద్రం లోనికి సెల్ ఫోన్లు, ఎలాంటి ఎక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని సూచించారు.

జిల్లా ఇన్చార్జి దీపక్ తివారి జిల్లాలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు వివరిస్తూ.. పరీక్షల నిర్వహణకు 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, దీని కోసం18 రూట్లను రూపొందించడం జరిగిందని, పరీక్షల నిర్వహణకు 70 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 74 మంది లైజనింగ్ అధికారులు, 38 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, జిల్లాలో మొత్తం 19,800 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నట్లు తెలుపుతూ పరీక్ష నిర్వహణలో నిబంధనలను పఠిష్టంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ రె వెన్యూ డివిజనల్ అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, కలెక్టరేట్ విభాగం సూపరింటెండెంట్లు శ్రీనివాసరాజు, గిరిధర్, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News