Wednesday, January 22, 2025

నేటి నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనేపథ్యంలో నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 8,180 పోస్టుల కోసం 9.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 జరుగుతాయని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు వచ్చే పరిస్థ్దితి ఉంటుందన్నారు. హాల్‌టికెట్ వెనకభాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబందనలు పొందుపరుచామని, వాటికి తప్పక పాటించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News