Wednesday, January 22, 2025

గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కమిషన్ తెలిపింది. టిజిపిఎస్‌సి కార్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. త్వరలోనే రోజువారీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి గతేడాది జులై ఒకటో తేదీన రాతపరీక్ష నిర్వహించి, ఈ ఏడాది ఫిబ్రవరి 9న మెరిట్ జాబితాను టిజిపిఎస్‌సి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News