Monday, December 23, 2024

వారంలో 28వేల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

రెండు, మూడు రోజుల్లో గ్రూప్4 నోటిఫికేషన్
డిఎస్‌సి సహా 9వేల పోస్టుల భర్తీకి ప్రణాళికలు
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడి

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: రెండు మూడు రోజుల్లో గ్రూప్4 నోటిఫికేషన్ ఇవ్వనున్నామని, వారం రోజుల్లో మొత్తం 28వేల ఉద్యోగాల భర్తీకి వివిధ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. వీటిలో డిఎస్‌సి సహా 9వేల గ్రూప్4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయన్నారు. గురువారం సంగారెడ్డి పిఎస్‌ఆర్ గార్డెన్‌లో సంగారెడ్డి, కొండాపూర్, కంది మండలాలకు చెందిన ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బిజెపి ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని విమర్శించారు. బడా కంపెనీలకు రూ.12లక్షల కోట్లు బకాయిలు రద్దుచేసిన బిజెపి ప్రభుత్వం రెక్కాడితేగాని డొక్కాడని పేదలకు పెన్షన్లు ఇస్తే ఉచితాలు అనుచితమంటోందన్నారు. పేదల కోసం పథకాలు తీసుకువచ్చి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పంచుతుంటే.. బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దేశ సందపను పంచి పెడుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి పాలనలో ధరలు పెంచి పేదలను దోచుకోవడమే పాలనగా పెట్టుకున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా మన వద్దే రూ. 2016 పెన్షన్ ఇస్తున్నామన్నారు. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్ ఇస్తున్నదని, సంగారెడ్డికి 50కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం కదా.. అక్కడ ఇచ్చే పెన్షన్ కేవలం రూ.600 మాత్రమేనన్నారు. రాష్ట్రంలో మొత్తం 45లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.12వేల కోట్ల రూపాయలతో పింఛన్లు అదిస్తున్నామని చెప్పారు. ఎవరూలేని వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నాయని వెల్లడించారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదో ఆ పార్టీల నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు బిజెపికి సరైన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. పేద ప్రజల కోసం సిఎం కెసిఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలుచేస్తున్నారని వెల్లడించారు. సొంత జాగాలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ. 3లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగ నుంచి ప్రారంభిస్తామన్నారు.

Group 4 Notification Soon to fill 28k Vacancies: Harish Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News