Monday, December 23, 2024

ఏప్రిల్ 4 నుంచి గ్రూప్ 4 ఆఫ్‌లైన్ కోచింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్ 4 కోసం ఆఫ్‌లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 4న ప్రభుత్వ సిటీ కాలేజీ నయాపూల్ నందు ప్రారంభిస్తున్నట్లు టిఎస్‌బిసిఇఎస్‌డిటిసి డైరెక్టర్ కె. అలోక్ కుమార్ తెలిపారు. ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ దరఖాస్తును నేరుగా విద్యార్హతల ధృవీకరణ నకళ్లు, కుల ధృవీకరణ పత్రాలతో మార్చి 31 లోగా సమర్పించాలని సూచించారు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.

బిసి స్టడీ సర్కిల్, ఏదైనా ఇతర ప్రభుత్వ కోచింగ్ సెంటర్‌లలో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థి పైన పేర్కొన్న కోచింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులు కారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్శికాదాయం సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తులను బిసి స్టడీ సర్కిల్ ప్రొఫెసర్ జి. రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ క్యాంపస్, తర్నాక, హైదారబాద్‌లో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 04027077929, 04024071178 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News