Sunday, January 19, 2025

గ్రూప్4 ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

గ్రూప్4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,180 గ్రూ ప్4 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్4 ఉద్యోగాలకు ఎంపికైన అ భ్యర్థుల ప్రొవిజనల్ జాబితా చేసింది. 2022 డిసెంబర్ 1న నోటిఫికేషన్‌లో భాగంగా 8,180 పోస్టులకు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. 2023 జులై 1న నిర్వహించిన గ్రూప్4 పరీక్షకు దాదాపు 80 శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పలు దఫాల్లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాజాగా కమిషన్ ఫలితాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.inను సందర్శించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News