Saturday, September 21, 2024

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో బాహాబాహీ

- Advertisement -
- Advertisement -

ఘర్షణకు దిగిన ఇరువర్గాలు కారు అద్దాలు ధ్వంసం
పలువురికి గాయాలు పక్షం రోజుల్లో ఇది రెండో ఘటన

మన తెలంగాణ/ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో మరోసారి గ్రూపు తగాదాలు బైటపడ్డాయి. పక్షం రోజులు కూడా గడవకముందే ఇలా రెండోసారి కాంగ్రెస్ నేతలు రోడ్డకెక్కడం పార్టీలోని సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన్‌మోహన్ వర్గీయులు శుక్రవారం ఇలా బాహాబాహీకి దిగారు. ఏకంగా కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట నియోజకవర్గంలోని రాజంపేట మం డలం ఎల్లారెడ్డి తండాలో మదన్‌మోహన్ తన వర్గీయులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నాగిరెడ్డిపేటలో సుభాష్‌రెడ్డి వర్గం కార్యకర్తలూ రచ్చబండ కార్యక్రమంలో ఉన్నారు. ఇదిలా ఉండ గా.. మదన్ మోహన్ రావు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న సుభాష్‌రెడ్డి వర్గీయులు హుటాహుటిన ఎల్లారెడ్డి తండాకు చేరుకున్నారు.

తాము నిర్వహిర్వహించుకుంటున్న రచ్చబండ కార్యక్రమానికి సుభాష్‌రెడ్డి వర్గీయులు రావడాన్ని మదన్ వర్గీయులు తప్పుపడుతూ.. తాము నిర్వహించుకుంటున్న కార్యక్రమంలో మీకేంటి పనంటూ నిలదీశారు. దీంతో సుభాష్‌రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి వర్గీయులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగి దూషించుకున్నారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కారు అద్ధాలు సైతం ధ్వంసం అయ్యాయి. ఘటన సమయంలో మదన్ మోహన్ రావు అక్కడే ఉండటంతో అతనిపై కూడా దాడి జరిగింది. ఇరు వర్గాలకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడగా, స్థానికులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. కొద్దిసేపు తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఇరువర్గాలవారు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. గాయపడిన పలువురు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించికొని అనంతరం వెళ్లిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీలో 15రోజుల క్రితం, లింగంపేట మండలంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, ఇదేవిధంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్.. మదన్ మోహన్ రావును సస్పెండ్ చేయగా, దీనిపై పార్టీ నాయకత్వం తప్పుపట్టింది. అనంతర జరిగిన పరిణామాలతో నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఎవరికి వారు బల నిరూపణకు ప్రయత్నించడం పట్ల ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈవిధఃగా ఘర్షణ పరిస్థితులు ఏర్పడటానికి కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్లు ఇలా ఘర్షణలకు దిగడం పట్ల దిగువస్థాయి కార్యకర్తల్లో గందర గోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏది ఏమైనా.. గ్రూపు తగాదాల పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించి గ్రూపు తగాదాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News