Sunday, December 22, 2024

తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

- Advertisement -
- Advertisement -

Group of Tamil Nadu students visited TS Commission for Women

మహిళా కమిషన్ కార్యక్రమాలపై హర్షం
రాష్ట్ర మహిళా కమిషన్‌ను సందర్శించిన తమిళనాడు విద్యార్థిబృందం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని తమిళనాడు విద్యార్థులు కొనియాడారు. మహిళా రంగాన్ని భవిష్యత్తులో ముందంజలో నిలిపేందుకు పథకాలు దోహదపడుతాయని అభిప్రాయపడ్డారు. తమిళనాడు పిజి సోషల్‌వర్క్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు తమ చదువులో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేస్తున్న కార్యక్రమా గురించి తెలుసుకోడానికి హైదరాబాద్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తమిళనాడు విద్యార్థినులు తమ తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తే మహిళలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి రాష్ట్రంలో మహిళల కోసం కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరించారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. మహిళలు అన్నింటిలోనూ ఎదగాలని, మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని కృష్ణ కుమారి వివరించారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి “వెడ్‌నెస్‌డే వాక్‌” పేరుతో ప్రతి బుధవారం గ్రామాల్లో లింగ వివక్ష, బాల్యవివాహాల నిరోధంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. అనంతరం తమిళనాడు కాలేజీ ప్రొఫెసర్ డాన్మిక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు అద్భుతమని ప్రశంసించారు. మహిళలకు చేరువుగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితా లకా్ష్మరెడ్డి వాట్సాప్ హెల్ప్‌లైన్ 9490555533 అందుబాటులోకి తీసుకురావడం, మహిళల రక్షణ, గౌరవం, సాధికారత పై చైర్ పర్సన్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News