Monday, December 23, 2024

గ్రూప్1పోస్టులపై సర్వత్రా చర్చ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వెలువడనున్న రెండో గ్రూప్1 నోటిఫికేషన్‌పై గురించి అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్ని పోస్టుల తో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది అన్నదానిపై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఏ నలుగురు ఆశావాహులు ఒక్కచోట చేరినప్పటికీ దానిపైనే మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే మరోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చి 2025 ఫి బ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జా బ్ క్యాలెండర్‌లో తెలిపింది. గ్రూప్- 1 మెయిన్స్ ను 2025 జులైలో నిర్వహిస్తామని పేర్కొంది. వ చ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ -2 నోటిఫికేష న్ విడుదల చేసి, అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్- 3 నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో తెలిపిం ది. అసెంబ్లీ డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిగతా నోటిఫికేషన్ల కంటే గ్రూప్ 1 గు రించే అభ్యర్థులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. గ త ప్రభుత్వం 2022లో 503 గ్రూప్ 1 పోస్టుల కు నోటిఫికేషన్ ఇచ్చి రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష లు నిర్వహించింది.

ఒకసారి పేపర్ లీక్ అవడం కారణంగా, మరొకసారి నిర్వహణ లోపం కారణంగా రెండుసార్లు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయింది. ప్రస్తుత ప్రభుత్వం గత నోటిఫికేషన్‌లోని 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి కొత్తగా 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9వ తేదీన ఆఫ్‌లైన్ విధానంలో 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1కు మొత్తం 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3,02,172 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. విజయవంతంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలు కూడా విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టిజిపిఎస్‌సి వెల్లడించింది. 563 గ్రూప్ 1 పోస్టులకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా కమిషన్ మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022 వరకు గ్రూప్1 నోటిఫికేషన్ వెలువడలేదు. గత ప్రభుత్వం మొదటిసారిగా 503 గ్రూప్ 1 పోస్టులతో తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో వెలువడిన గ్రూప్1 ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి 128 నియామకాలు పూర్తి చేసింది. 2018లో120కి పైగా పోస్టులతో తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్ వెలువరించేందుకు టిఎస్‌పిఎస్‌సి కసరత్తు పూర్తిచేసినా…నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ప్రకటన విడుదల కాలేదు. అనంతరం 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా, రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దయి 2024లో విజయవంతంగా ప్రిలిమ్స్ పూర్తయింది. అయితే రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్ద కావడంతో కొంతమంది విద్యార్థులు నిరాశ చెంది అంత సీరియస్‌గా మూడోసారి ప్రిపేర్ కాలేదని తెలిసింది.

అయితే ప్రభుత్వం మళ్లీ ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వివిధ కారణాలతో పరీక్షకు హాజరుకాలేకపోయిన వారు, హాజరైనా పరీక్ష బాగా రాయలేక మెయిన్స్ ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారితో పాటు కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్ 1 లక్షంగా ప్రిపరేషన్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అక్టోబర్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో నోటిఫికేషన్ అవుతుంది. అయితే కొత్త నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉంటాయి..? గత నోటిఫికేషన్ కంటే అధికంగా ఉంటాయా..? తక్కువగా ఉంటాయా..? అని నిరుద్యోగ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.

సివిల్స్ ప్రిపేరయ్యే అభ్యర్థులు సైతం
రాష్ట్రంలో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు సివిల్స్‌కు ప్రిపేపరవుతున్న అభ్యర్థులు సైతం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షల విధానం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. గ్రూప్ 1కు సివిల్స్ మాదిరిగానే ప్రిలిమినరీ, మెయిన్స్ అనే రెండు దశలు ఉంటే, సివిల్స్‌కు ప్రిలిమినరీ, మెయిన్స్‌తో పాటు ఇంటర్వూ అనే మూడో దశ ఉంటుంది. సివిల్స్, గ్రూప్ 1కు సిలబస్ కూడా ఇంచుమించు సమానంగా ఉంటుంది. దాంతో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో అధిక శాతం గ్రూప్ 1 కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలతో పాటు గ్రూప్ 1 సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. వీరితోపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారితో పాటు ఎంబిబిఎస్ పూర్తి చేసిన వైద్యులు సైతం గ్రూప్ 1కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం గ్రూప్ 1 కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ప్రైవేట్ రంగంలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా సరైన గుర్తింపు లభించకపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News