Friday, November 22, 2024

ఇవి, పెట్రో వాహనాల ధరల మధ్య వ్యత్యాసం

- Advertisement -
- Advertisement -

ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆధరణ

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటి ధరల విషయానికొస్తే వినియోగదారులు పెదవి విరిస్తున్నారు. దీనికి కారణం సబ్సిడీ తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు డీజిల్-, పెట్రోల్ మోడల్‌ల రేట్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు బదులుగా సంప్రదాయ ఇంధన వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారికి రానున్న రోజుల్లో ఉపశమనం లభించనుంది. ఆటోమొబైల్ కన్సల్టెన్సీ సంస్థ జాటో డైనమిక్స్ డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, డీజిల్-పెట్రోల్ వాహనాల మధ్య ధరల వ్యత్యాసం వేగంగా తగ్గుతోంది.

గణాంకాల ప్రకారం, 2020 సంవత్సరంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం సగటు ధర పెట్రోల్ వేరియంట్ కంటే 137 శాతం ఎక్కువగా ఉంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు రెండింతలు ఖరీదు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యత్యాసం 73 శాతం మాత్రమే ఉంటోంది. గత మూడు సంవత్సరాలలో సంప్రదాయ ఇంజిన్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల మధ్య ధర వ్యత్యాసం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది ఉద్గార ప్రమాణాలను ప్రభుత్వం నిరంతరం కఠినతరం చేస్తూ ఉంది. దీంతో వాహన కంపెనీలన్నీ తమ మోడల్స్ ధరలను పెంచాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా, కంపెనీలు తమ వాహనాల హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను అప్‌గ్రేడ్ చేయాలి.

ఇది వారి ధరను పెంచుతోంది. ఈ కారణంగా చివరికి పెట్రో వాహనాల ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. ఈ రేట్లు పెరగడం, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతుండడం వల్ల కొద్ది రోజుల్లో రెండు రకాల వాహనాల రేట్లు సరిసమానంగా మారినా మారొచ్చు. ఇప్పటికే దిగ్గజ వాహన కంపెనీలతో పాటు పలు స్టార్టప్‌లు ఎలక్ట్రిక్ వాహనాల కోసం నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లో అన్ని కంపెనీలు ఇవి బాట పట్టొచ్చనడడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే ప్రస్తుతానికైతే ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు మాత్రం పెట్రో వాహనాల ధరల కంటే ఎక్కువగానే కొనసాగే అవకాశముంది. క్రమ క్రమంగా వీటి మధ్య వ్యత్యాసం తగ్గుముఖం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ సహాయం పనిచేస్తోంది
మరోవైపు దేశీయ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఇతర విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి అనేక ప్రోత్సాహక పథకాలు కొనసాగుతున్నాయి. దేశీయ తయారీని పెంచడం వల్ల బ్యాటరీ ప్యాక్‌లతో సహా మొత్తం ఖర్చు తగ్గుతుంది, ఇది చివరికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గిస్తుంది.

వేగవంతం అవుతున్న ఇవి స్వీకరణ
మొత్తంమీద, డీజిల్-పెట్రోల్ ఇంజన్ వాహనాలు అంటే ఐసిఇ వాహనాల ధరలలో పెరుగుతున్న ధోరణి ఉంది, అయితే ఎలక్ట్రిక్ వాహనాల ధరలలో తగ్గుదల ధోరణి ఉంది. ఈ ట్రెండ్ రానున్న కాలంలో కూడా కొనసాగవచ్చు. ఇది రెండు రకాల వాహనాల ధరలలో వ్యత్యాసాన్ని తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే చౌకగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News