Monday, January 20, 2025

దేశంలో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్

- Advertisement -
- Advertisement -

Growing demand for luxury cars in India

న్యూఢిల్లీ: దేశంలో మెర్సిడెజ్ బెంజ్, ఆడి, బిఎండబ్ల్యు సంస్థలు ఉత్పత్తి చేస్తున్న లగ్జీ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోందని ఆయా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఆయా కార్లను బుక్ చేసుకున్న వారు నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. ‘ రూ.70 75లక్షలు, ఆపై విలువ చేసే కార్లకు గత ఏడాది కాలంగా డిమాండ్ పెరుగుతోంది. వీటిని కొనే సామర్థం ఉండే వారు విలాసవంతమైన కారవైపు మొగ్గు చూసుతున్నారు. అందుబాటు ధరలో ఉండే కార్లకంటే వీటి విక్రయాల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. కోటికి పైగా ధర ఉండే ఆడి ఇట్రాన్ కార్లు భారత్‌కు రాకముందే అమ్ముడై పోతున్నాయి. ఒకప్పుడు వీటికోసం గరిష్ఠంగా రెండు మూడు నెలలు వేచి చూసేవారు. ఇప్పుడు ఆరు నెలలు ఆగాల్సి వస్తోంది’ అని ఆడి ఇండియా అధినేత దల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండి, సిఇఓ మార్క్ శ్వెంక్ కూడా ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.తమ సంస్థనుంచి వస్తున్న జిఎల్‌ఎస్, జిఎల్‌ఇ వంటి కార్ల ్ల కోసం కస్టమర్లు నెలల తరబడి వేచి ఉంటున్నారన్నారు.

2022లో ఈ సెగ్మెంట్‌లో 4000 యూనిట్లకు పైగా ఆర్డర్లు అందాయన్నారు.2021లో కోటికి పైగా విలువ చేసే కార్లు 2000 యూనిట్లకు పైగా అమ్ముడు పోయినట్లు తెలిపారు. బిఎండబ్లు ప్రీమియం కార్లకు కూడా ఇదే తరహా డిమాండ్ ఉందని ఆ సంస్థ భారత ప్రతినిధి విక్రమ్ తెలిపారు. ఎక్స్3, ఎక్స్ 4,ఎక్స్ 7 వంటి ‘ స్పోర్ట్ యాక్టివిటీ వెహికిల్స్’కుడిమాండ్ భారీగా ఉందన్నారు.ఈ విభాగంలో 40 శాతం వరకు వృద్ధి కనిపిస్తోందన్నారు. 2022 తొలి మూడు నెలల్లో రూ.61 లక్షలు విలువ చేసే తమ కంపెనీ కార్ల విక్రయాల్లో 40 శాతం వృద్ధి నమోదయిందన్నారు. సెమీ కండక్టర్ల కొరత, రవాణాచార్జీల పెరుగుదల, రష్యా ఉక్రెయిన్ యుద్ధప్రభావం వంటి సవాళ్లు ఈ ఏడాది చివరి నాటికి తొలగిపోతాయని ఆయా కంపెనీల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News