Monday, December 23, 2024

నీళ్లు మీకు.. కన్నీళ్లు మాకా?

- Advertisement -
- Advertisement -

గోదావరి వరదల సమగ్ర అధ్యయనంపై పెరుగుతున్న డిమాండ్లు

పోలవరం డ్యాం బ్యాక్ వాటర్ ప్రభావం మరింత అధికం ఆధునాతన సాంకేతికతో కాంటూర్ లెవల్స్ గుర్తింపు
బాధిత ప్రాంతల రక్షణకు తక్షణ చర్యలు బాధ్యత అంతా కేంద్రానిదే

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఎగువన 118కిలోమీటర్ల దూరాన గోదావరి నదికి ఇరువైపులా ఉన్న లోత ట్టు ప్రాంతాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్డు నిర్మాణం వల్ల నీళ్లు మీకు.. కన్నీళ్లు మాకా అని నదికి ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యాం, డయాప్రం వాల్ లోపాలపై తప్పులు మీ వంటే మీవని అధికార విపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలతో సోమవారం ఏపి అసెంబ్లీ ఉడుకెత్తిపోయింది. ముఖ్యమంత్రి జగన్ సభలో ప్రా జెక్టుపై ప్రభుత్వ చర్యలను వివరించారు. బ్యాక్ వాటర్ ద్వారా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నదికి ఇరువైపుల పెనుఉప్పెనలా విరుచుకుపడిన వరదముంపు సమస్యపై నామమత్రంగానైనా అసెంబ్లీలో ప్రస్తావించలేదు.

గోదావరినదికి జులైలో వచ్చిన భారీ వరదలు, ముంపు ప్రాంతాల అధ్యయనం , లోతట్టు ప్రాంతాల సమస్యలు , నష్టనివారణకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్త,కర్మ, క్రియగా ఉన్న నరేంద్రమోడి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలపై వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజానీకాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గోదావరినదిలో 36లక్షల క్యూసెక్కలు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీటివిడుదల సామర్ధంతో డిజైన్ చేసిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాజెక్టు ఎగువన 276గ్రామాలు నీటిముంపునకు గురికానున్నాయి. డ్యాం నీటివిడుదల సామర్ధాన్ని 50లక్షల క్యూసెక్కలకు పెంచుతూ డిజైన్లు మార్చారు.

దీంతో ముంపు గ్రామాల సంఖ్య 371 గ్రామాలకు పెరుగుతుందని లెక్కించారు. ముంపునకు గురయ్యే సాగుభూములు కూడా 97వేల ఎకరాలుగా గుర్తించారు. నిర్వాసితుల సంఖ్య కూడా 4లక్షలకు పైనే ఉంది. అయితే ముంపు సమస్యపై ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు, అంచనాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి .బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల పరిధి మరింత పెరుగుతుందని జులైనాటి వరదలే నిరూపించాయి. పోలవరం ప్రాజెక్టు ఇంకా నిర్మాణదశలోనేవుంది. రెండు నెలల కిందటి గోదావరి వరదలు కొన్ని గంటల వ్యవధిలోనే భద్రాచలం వద్ద అన్ని ప్రమాద హెచ్చరికలను దాటేశాయి. గోదావరి నది వరదల చరిత్రలో జులై నెలలోనే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71అడుగులకు చేరటం రోజలు తరబడి ఆదే స్థితిలో కొనసాగి భద్రాచలం పట్టణంతో నదికి ఇరువైపులా ఉన్న లోతట్టు గ్రామాలు వరదనీటిలో కూలనానటం ఇంకా ఈ ప్రాంత ప్రజలను మానని గాయంలా తొలుస్తోంది. ఏకంగా 24లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం గ్రామాలకు గ్రామాలనే ముంచెంత్తింది.

ఫ్లడ్‌మాన్యువల్‌ను మార్చాల్సిందే :

గోదావరికి వరదల సమయంలో నీటిమట్టాలు, నదిలో నీటి ప్రవాహాలపై దశాబ్దాల కిందట రూపొందిచిన ప్లడ్ మాన్యువల్‌నే ఇప్పటికీ ప్రమాణికంగా భావిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఉపనదులతోపాటు గోదావరినదిపై నిర్మించిన ప్రాజెక్టులు ,బ్యారేజిలు వాటిలో నీటినిలువలు , భారీ వర్షాలు వదరల సమయంలో ఒక్కసారిగా ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుని , తెంచుకొని దిగువకు పరవళ్లు తొక్కతూ ప్రవహించే వరద ప్రవాహాలను లెక్కించేందుకు పాత మాన్యువల్‌నేకొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరినదిలో నీటిమట్టం 43అడుగులకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక , 48అడుగుల వద్ద రెండవ హెచ్చరిక, 53అడుగులకు పెరిగితే మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.అయితే గోదావరికి వరదలు ఈ ప్రమాద హెచ్చరిలను మించి పోయి వందల గ్రామాలను గంటల వ్యవధిలోనే ముంచుతున్నాయి. ఆగస్ట్ నెలలో భద్రాచలం వద్ద 66అడుగులకు నీటిమట్టం చేరిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అధునాతన సాంకేతిక అందుబాటులోకి వచ్చినా, కేంద్ర జలంసఘం ఇంకా ఫ్లడ్‌మాన్యువల్ ఆధునీకరణపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు జలవనరులు రంగం నిపుణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

పోలవరం బ్యాక్ వాటర్ సమగ్ర అధ్యయనంపై పెరుగుతున్న డిమాండ్లు:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి నదిలో పెరిగే బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత అన్నది ఆధునాతన సాంకేతిక పద్దతులు ద్వారా అంచనా వేసేందుకు సమగ్ర అధ్యయనం నిర్వహించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంతోపాటు చత్తిస్‌గడ్ , ఒడిశా రాష్ట్రాలు కూడా గత కొంతకాలంగా ఈ డిమాండ్లు వినిపిస్తూ ,పోలవరం ప్రాజెక్టు అథారిటీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా వత్తిడి పెంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్ వాటర్ ముంపు మరింత తీవ్రంగా పొంచివున్నట్టు తాజా వరదలే అద్దం పడుతున్నాయి. పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడ్ భధ్రాచలం , చర్ల , దుమ్ముగూడెం తదితర మండలాలపైన ఏటా రెండు మూడు సార్లు ముంపు దెబ్బపడుతూనేవుంది. భద్రాచలం ఎగువన 26కిలోమీటర్ల వరకూ పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

కాంటూర్ లెవల్స్‌పై స్పష్టత రావాలి:

గోదావరి వరద తీవ్రత, నదికి ఇరువైపులా వరద ముంపునకు గురయయే ప్రాంతాలు , వరద నీటి విస్తరణ విస్తీర్ణం ఎంత అన్నది స్పష్టతనిస్తూ తాజాగా కాంటూర్ లెవల్స్‌ను నిర్ధారించాలని ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు పట్టుపడుతున్నారు. గోదావరినదికి ఇరువైపులా వరద నీరు విస్తరించిన ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రజలందిరికీ తెలిసేలా శాశ్వత ప్రాతిపదికన మార్కింగ్ చేయాలని కోరుతున్నారు. గోదావరికి భారీ వరదలు , తాజా విపత్తులు , విపత్కర పరిస్థితులుకు కారణాలు అన్వేషించి నష్టనివారణకు ప్రతిపాదనలు సిద్దం చేయలని కోరుతున్నారు. భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక రూపొందించి ఆదిశగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News