Sunday, January 19, 2025

రావణకాష్టంలా దేశం

- Advertisement -
- Advertisement -

బిజెపి విధానాలతో పెరుగుతున్న విద్వేషాలు

మాట్లాడితే విషం చిమ్మడం
కమలనాథుల సంస్కృతి
తెలంగాణను కేంద్రం సతాయిస్తోంది
దేశంలో తెలంగాణ వంటి
సంస్కారవంతమైన ప్రభుత్వం
ఉందా? 8ఏళ్లలో సిఎం కెసిఆర్
తెలంగాణను అగ్రభాగంలో
నిలిపారు కొత్త రేషన్‌కార్డులు,
పింఛన్లు, ఇళ్ల నిర్మాణానికి డబ్బులిస్తాం
: కొల్లాపూర్, నాగర్‌కర్నూల్
బహిరంగ సభల్లో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: అభివృద్ధే మన కులం.. సంక్షేమమే మన అభిమతంగా, కులమతాల కు అతీతంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనను సాగిస్తున్నారని, అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశా న్ని రావణకాష్టంగా మారుస్తూ.. తె ల్లారితే కులం, మతం అంటూ క య్యాలు పెట్టడం తప్ప.. మరో పనిలేదని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ బిజెపి, మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డా రు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ని యోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శం కుస్థాపనలు చేశారు. అనంతరం కొ ల్లాపూర్, బిజినేపల్లిలలో ఏర్పాటు వేర్వేరు బహిరంగసభలలో ఆయ న ప్రసంగించారు. 2013లో అధికారంలోకి రాకముందు నల్లధనం తెచ్చి జన్‌ధన్ ఖాతాలలో 15 లక్షలు వేస్తానని మోసం చేసి అధికారంలోకి వ చ్చారని విమర్శించారు. స్వాతంత్రం సిద్ధించిన 75 ఏళ్లలో ప్రజలను పట్టించుకోని కొందరు ఎన్నికలు దగ్గర ప డుతున్న సమయంలో పార్టీల అజెండాతో ప్రజలను తప్పుదోవ పట్టించేవారు వస్తారని అలాంటి వారిని ప ట్టించుకోవద్దన్నారు. ఒక పార్టీ 65ఏళ్ల పాటు తాతలు, ముత్తాతలు పాలించిన నాటి నుంచి ప్రజల ఆకాంక్షల ను పట్టించుకోలేదని, మరో పార్టీ కేం ద్రంలో 8ఏళ్లుగా అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి అధికారమే పరమావధిగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటూ రాజకీయ ఉనికికోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రం 8 ఏళ్ల క్రితం పురుడు పోసుకుని దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంటే, కేంద్రం సతాయిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను హరిస్తూ కక్ష సాధింపుకు గురిచేయడం, తిరిగి ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకోవాలని చూ డడం సిగ్గుచేటన్నారు. 8ఏళ్లలో రాష్ట్రంలో సిఎం కెసిఆర్ సారధ్యంలో సాగు, తాగు నీ రు, విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకున్నామన్నారు. ఒక పక్క అభివృ ద్ధి, మరో పక్క సంక్షేమంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సంస్కారవంతమైన ప్ర భుత్వంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇలాంటి సంస్కారవంతమైన ప్రభుత్వం దేశంలో ఉందా అని కెటిఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వరంగల్‌కు వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ముత్తాత నెహ్రూ నుంచి నానమ్మ, నా న్న, తల్లి దేశాన్ని పాలించిన కాలంలో మీరు ప్రజలకు చేసింది ఏమిటన్నది ఒక్కసారి ప్రశ్నించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మిగిలింది చరిత్ర తప్ప.. ఆ పార్టీకి భవిష్య త్తు లేదన్నారు. 2014కు ముందు రూ.75 ఉన్న పెన్షన్, కెసిఆర్ సిఎం అయ్యాక రూ. 2వేలుగా అందిస్తున్నారన్నారు.

నేడు 40 లక్షల మందికి రూ.10వేల కోట్ల పెన్షన్లు ఇస్తున్న ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. జూన్, ఆగస్టు నెలల్లోఇంటింటికీ వచ్చి కొత్త పెన్షన్లు అందిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నామన్నారు. విద్య, వైద్యం విషయంలో టిఆర్‌ఎస్ ప్రభు త్వం పెద్దపీట వేసిందన్నారు. నాడు కాంగ్రెస్, ఇతర పార్టీల ఏలికలో మంత్రులుగా చలామని అయిన నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు డిగ్రీ కళాశాలలకు నోచుకోలేదని అలాంటి నాగర్‌కర్నూల్‌లో మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనత కెసిఆర్‌కు దక్కగా అది సాధించిన ఘనత మీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిదేనన్నారు. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారని మన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు నేరుగా పెట్టుబడి ఇచ్చే విప్లవాత్మక ఆలోచన వారి కి ఎందుకు రాలేదని కెటిఆర్ ప్ర శ్నించారు.

ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డి, ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్ రెడ్డి ల అధ్యక్షతన జరిగిన సభలలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి పోతుగంటి రాములు, జడ్పి చైర్‌పర్సన్ పద్మావతి, ఎంఎల్‌ఎలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లకా్ష్మరెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అబ్రహం, ఎంఎల్‌సి, మండలి విప్ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎంఎల్‌సిలు సురభి వాణిదేవి, గోర టి వెం కన్న, కసిరెడ్డి నారాయణ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, వాల్యా నాయక్, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్, డిసిసిబి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నిజాం పాషా, డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపి మంధా జగన్నాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హనుమంత్ రావు, బాలాజీ సింగ్, విజితా రెడ్డిలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News