Sunday, December 22, 2024

మెట్రోకు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -

Growing popularity for Hyderabad metro

థర్డ్‌వేవ్ ముగిసిన తరువాత గాడిపడుతున్న మెట్రో
నాలుగు రోజుల నుంచి లక్ష దాటుతున్న ప్రయాణీకులు సంఖ్య
వర్క్‌ఫ్రం హోమ్ ఎత్తివేయడంతో కార్యాలయాలకు వెళ్లతున్న ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో థర్డ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటి నుంచి ప్రయాణికులు ఆదరిస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. ఐదు రోజుల నుంచి మెట్రో కోచ్‌లో ఓజోన్ ఆధారిత శానిటైజేషన్ చేపడుతుండటంతో వైరస్ సమస్య ఉండదని ప్రయాణీకులు భావిస్తూ మెట్రో ప్రయాణం సురక్షితమని అంటున్నారు. మూడు పోర్టబుల్ ఓజోకేర్ మొబిజోన్ యూనిట్లను కోచ్‌లను పరిశుభ్రం చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. గాలితో పాటు ఉపరితలాలను శానిటైజ్ చేయడానికి హాస్పటిల్స్, హెల్త్‌కేర్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కోచ్ పరిశుభ్రం చేసేందుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత నాలుగు రోజుల నుంచి మూడు కారిడార్ల పరిదిలో రోజుకు 1.10లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.

ఉదయం 6గంటల నుంచి రాత్రి 11.15 గంటలవరకు చివరి స్టేషన్‌కు రైల్ చేరుకునేలా చేశామని, దీంతో చాలామంది ఉద్యోగులు సొంత వాహనాలపై వెళ్లకుండా మెట్రో పై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. వర్క్ ప్రం హోమ్ ఐటీ సంస్దలు ఎత్తివేత్తివేయడంతో సాప్ట్‌వేర్ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఎల్బీనగర్‌మియాపూర్ కారిడార్ పరిధిలో అత్యధికంగా ప్రయాణిస్తున్నట్లు, తరువాత నాగోల్ మాదాపూర్ కారిడార్ కూడా ఆశించిన స్దాయిలో జనం వెళ్లుతున్నట్లు వివరించారు. మరో వారం రోజుల్లో మెట్రో స్టేషన్లు రద్దీగా మారుతాయని స్టేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, భవిష్యత్తులో మరి నూతన ఆఫర్లు తీసుకొస్తామని, ఇటీవల ప్రవేశపెట్టిన సువర్ణ ఆఫర్‌ను నగరవాసులు ఆదరించడంతో మరికొన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కంటే ముందు ఏవిధంగా మెట్రో జనంతో కిటకిటలాడిందో మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News