Friday, November 22, 2024

కొత్త ఏడాది నుంచి మెట్రోకు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -

Growing popularity of Hyderabad metro from new year

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్‌కు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి రోజుకు ప్రయాణికుల సంఖ్య 1.70లక్షలు దాటుతుందని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. కరోనా టీకా రావడంతో ఫిబ్రవరి తరువాత మరో 10శాతం ప్రయాణికులు పెరగవచ్చని మెట్రో సిబ్బంది భావిస్తున్నారు. దేశంలో ఎనిమిది నగరాల్లో మెట్రో సేవలందిస్తుండగా, అందులో నాణ్యమైన సేవలందించడంతో రెండోస్దానం హైదరాబాద్ మెట్రో దక్కించుకుంది. దీంతో అధికారులు ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు నూతన విధానాలు తీసుకొస్తున్నారు. దీనికి తోడు కోవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇతర వాహనాల్లో వెళ్లితే వైరస్ సోకే ప్రమాదముందని భావిస్తూ మెట్రో వైపు గమ్యస్దానాలకు చేరుకుంటున్నారు.

మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 360ట్రిప్పులు సర్వీసు తిరగడంతో స్టేషన్‌కు వెళ్లిన రైల్ అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రెండు నెలపాటు కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న భరత్‌నగర్, ముషీరాబాద్, గాంధీ ఆసుప్రతి స్టేషన్లు తెరవడంతో ఈస్టేషన్ల నుంచి రోజుకు 4వేల మంది వెళ్లతున్నట్లు మెట్రో ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రారంభంలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రైన్లు నడిచేవి, గత వారం రోజుల నుంచి రైళ్ల వేళ్లలో మార్పులు చేస్తూ ఉదయం 6.30గంటలకు మొదటి రైలు ప్రారంభిస్తున్నారు. రాత్రి 9.30గంటలకు చివరి రైల్ బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు రాత్రి 10.30 చేరుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈమార్పుతో మరో 5వేలు మంది ప్రయాణిలకు సంఖ్య పెరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు.

ప్రయాణికుల సంఖ్య రెట్టింపుతో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువగా ఎల్బీనగర్, దిల్‌షుక్‌నగర్,ఎంజిబిఎస్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి,మియాపూర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, నారాయణగూడ స్టేషన్లు నుంచి ప్రయానిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. సాప్ట్‌వేర్ కంపెనీల సేవలు ప్రారంభమైతే మరో 50వేలు మంది పెరగవచ్చంటున్నారు.వచ్చే నెల నుంచి ప్రయాణికుల సంఖ్య రెండు లక్షలకు చేరుకోవచ్చని మెట్రో సిబ్బంది అంచనా వేస్తున్నారు. కరోనా టీకా రావడంతో వేసవికాలంలో మెట్రో జన సందడిగా మారుతుందని పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News