Friday, December 27, 2024

వంట నూనెల దిగుబడి వృద్థికి తిరగమోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశానికి సర్వదా అత్యంత కీలకం, ఆయువుపట్టు అయిన వ్యవసాయరంగం ప్రగతిని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు. వంటనూనెలు విభాగంలో దేశం స్వయం సమృద్థి చెందాల్సి ఉంటుంది. ఇందుకు చమురు గింజల పంటల ఉత్పత్తి దేశీయంగా మరింతగా పెరిగేలా చర్యలు తీసుకుంటారని వివరించారు. రైతులకు వ్యవసాయ అనుబంధం అయిన పాడిపరిశ్రమకు సరైన మద్దతు ఇచ్చేందుకు సమగ్ర రీతిలో కార్యక్రమం చేపడుతారని వివరించారు. దేశంలో వంటనూనెలు నిత్యావసర సరుకు. అవసరాల మేరకు మనదేశం భారీ స్థాయిలో ఇతర దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకోవల్సి వస్తోంది. 2022 23 సంవత్సరంలో భారత్ ఏకంగా అవసరాల మేరకు దాదాపు 165 లక్షల టన్నుల నూనెలను దిగుమతి చేసుకుంది. దీనికి అయిన ఖర్చు రూ 1.38 లక్షల కోట్లు. వంటనూనె దిగుమతి భారం తగ్గించేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వంటనూనెల గింజల పంటలను రైతులు మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసేందుకు వీలు కల్పిస్తున్నారని ఆర్థిక మంత్రి తెలిపారు.

పలు రకాల వంటనూనెల గింజలు అంటే పల్లీ, ఆముదం , సోయాబిన్, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి వాటిలో ఆత్మనిర్భరత సాధించడం లక్షం అని మంత్రి తెలిపారు. ఆయా నూనెగింజలకు సంబంధించి అత్యధిక దిగుబడి రకాలు, ఆధునిక సాగు పద్థతులు , మార్కెట్ అనుసంధానం, సేకరణ, సరైన వెల కట్టడం, పంట బీమా వంటివి పాటిస్తారని చెప్పారు. ఈ రంగంలో పంటచేతికి వచ్చిన తరువాత ఘట్టాలే కీలకం అవుతాయి. ఈ విషయంలో సరైన పెట్టుబడులకు ప్రైవేట్ పబ్లిక్ రంగ పెట్టుబడులను ఇతోధికం చేయడం జరుగుతుంది. నూనెగింజల ప్రాసిసింగ్ తరువాత నూనె తయారీ వంటి కీలక విషయాలలో పెట్టుబడులకు వీలు కల్పిస్తారు. సంబంధిత వంటనూనెల ఉత్పత్తి పెరిగేందుకు నానో లిక్విడ్ డిఎపి వంటి ప్రధాన ఎరువుల వాడకం పెంచుతారు. అనేక రకాల వ్యవసాయిక క్లైమెటిక్ జోన్లకు ఈ ఎరువు సరిగ్గా పనిచేస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News