Thursday, January 23, 2025

బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే మత్స్య సంపద వృద్ధి

- Advertisement -
- Advertisement -

కరకగూడెం : బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే మత్స్య సంపద వృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కుర్నపల్లి లోని తన స్వగ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా చెరువును సందర్శించి అనంతరం సంబరంతో చెరువులో దూకి ఈత కొట్టారు. ఈ సందర్భంగా రైతులందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం చేపల పెంపకంపై దృష్టి సాధించలేదని బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే మత్స్య సంపద అధికంగా పెరుగుతుందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగానికి ఊపిరి పోసిన సిఎం కెసిఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో మత్యసంపద అభివృద్ధికి అద్భుతాలు లభించాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు వారికి ఆర్థిక స్వావలంబన కల్పించినందుకు సిఎం కెసిఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టామన్నారు.

రాష్ట్రంలో కులవృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారని చెరువులను అభివృద్ధి చేసి చేపలను పెంచే విధంగా అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు పూజారి కృష్ణ, వేణు, సందీప్ రెడ్డి, గుమ్మడిల్లి ప్రసాద్, ఫ్యామిలీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News