Wednesday, January 22, 2025

గృహలక్ష్మి దరఖాస్తుకు ఎల్లుండి ఆఖరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గృహలక్ష్మి పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కో సం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథ కం కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభు త్వం సాయం అందించనుంది. స్టేట్ రిజర్వ్ కోటాలో 43 వేలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గృ హలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లో కలెక్టర్ల ఆ ధ్వర్యంలో, జిహెచ్‌ఎంసిలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహల క్ష్మి అమలు కానుంది. వారే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. గృహలక్ష్మీ పథకానికి గృహిణులు, వితంతువులు మా త్రమే అర్హులు.

సొంతంగా ఇంటి స్థలం కలిగి ఉండాలి. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇవ్వనున్న ప్రభుత్వం ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇళ్లు పూర్తి మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహార భద్ర త కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులన్న ప్రభుత్వం ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వు కింద లబ్ధ్ది పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో తరువాయి
ఎస్‌సిలకు 20 శాతం, ఎస్‌టిలకు పదిశాతం, బిసి- మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపింది. జిల్లాల వారీగా దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధిస్తారో వారికి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌లు ఈ పథకం వర్తింపు చేస్తారు. ఆర్థికసాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టి భవిష్యత్‌లో ఆర్థికసాయం అందిస్తారు.

అధికారులు లబ్దిదారులను పరిశీలించి జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన అనంతరం బ్యాంక్ ఖాతాల్లో నగదు వేయనున్నారు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇంటి స్థలం దస్తావేజులు, సహా ఇతరపత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ నెల పదో తేదీ వరకు మీసేవద్వారా సదరు కార్యాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పది రోజుల్లోగా వాటిని పరిశీలించి ఈ నెల 25వ తేదీన ఇళ్లను మంజూరు చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News